కాళేశ్వరం పాలకమండలికి 90 దరఖాస్తులు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం పాలకమండలి(ట్రస్టుబోర్డు) కోసం ఆశావహుకులు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 90మంది వరకు దరఖాస్తులు చేసుకున్నట్లు ఆలయవర్గాల ద్వారా తెలిసింది. ఈనెల 5నుంచి 26వరకు పాలకమండలి డైరెక్టర్ల కోసం దేవాదాయశాఖ దరఖాస్తులు స్వీకరించారు. అసిస్టింట్ కమిషనర్, ఆర్జేసీ, కమిషనర్ కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేశారు. ఏడాది పాటు పదవి కాలంలో మొత్తం డైరెక్టర్లు, ఒక ఎక్స్అఫీషియో మెంబర్ అర్చకుడితో 15మంది నుంచి ఒక్కరిని చైర్మన్‌గా ఎన్నుకోనున్నారు. ఫిబ్రవరి 7, 8, 9తేదీల్లో కుంభాభిషేకం నిర్వహిస్తున్నారు. పూజల నిర్వహణను శృంగేరి పీఠం వేదపండితులు నిర్వహించనున్నారు. అంతకు ముందే పాలకమండలి నియామకం జరుగాలని ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. చైర్మన్ పదవిని నియోజకవర్గం కాకుండా ఇతర జిల్లాల వారిని నియమించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విదేశాల్లో ఉన్న నేపథ్యంలో ఆయన ఆశీస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆగస్టులో ట్రస్టుబోర్డుకు నోటిఫికేషన్ వేసి అనివార్య కారణాలతో మళ్లీ రీనోటిఫికేషన్ వేసిన విషయం తెలిసిందే.
త్వరలో ట్రస్టుబోర్డు ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment