‘రోగులకు మెరుగైన వైద్యం అందించాలి’
ములుగు: రోగులకు వైద్య సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా చైల్డ్ అండ్ ఇమ్యునైజేషన్ అధికారి రణధీర్, డాక్టర్ పవన్‌కుమార్ సూచించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో వైద్యారోగ్యశాఖ సమావేశ మందిరంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లకు, ఆరోగ్య కార్యకర్తలకు మంగళవారం నిర్వహించిన ఒక్క రోజు శిక్షణ శిబిరంలో వారు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం సబ్ సెంటర్, పీహెచ్‌సీలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సబ్ సెంటర్‌కు వచ్చే ప్రజలను సాదరంగా ఆహ్వానించి కావాల్సిన వైద్యం అందించాలన్నారు. గ్రామాల్లో వైద్యసేవలు మెరుగుపడితేనే శాఖకు మంచి పేరు వస్తుందని వివరించారు. సబ్ సెంటర్లకు ఎన్‌క్వాస్(నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్స్)నిబంధనలు పాటిస్తే ప్రత్యేక నిధులు మంజూరు అవుతాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment