ఫిబ్రవరి 3లోగా పనులు పూర్తిచేయాలి
ఎస్ఎస్ తాడ్వాయి: ఫిబ్రవరి 3వ తేదీలోగా మేడారం మినీ జాతర పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర్ అధికారులను ఆదేశించారు. మేడారంలో కలెక్టర్ మంగళవారం ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి పర్యటించారు. చింతల్ క్రాస్ రోడ్డు, కన్నెపల్లి, మేడారంలో జరుగుతున్న మినీ జాతర పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మేడారం జంపన్నవాగులో భక్తుల పుణ్య స్నానాల కోసం చేపట్టనున్న ఏర్పాట్లను పరిశీలించారు. కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయ పరిధిలోని పనులు, పార్కింగ్ స్థలాలు, జంపన్నవాగు వద్ద తాత్కాలిక డ్రెసింగ్ గదులు, వీఐపీ, వీవీఐపీ పార్కింగ్ స్థలాల ఏర్పాటు పనులు సైతం గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు కూడా పనుల్లో వేగం పెంచాలన్నారు. జాతర సమీపిస్తున్నందున పనుల ఏర్పాట్లలో నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. కలెక్టర్ వెంట ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వీరభద్రం, పీఆర్ ఈఈ అజయ్‌కుమార్, ఇరిగేషన్ ఈఈ నారాయణ, తాడ్వాయి డిప్యూటీ తహసీల్దార్ సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర్
Comments
Please login to add a commentAdd a comment