● ఏఎల్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల సుమన్
మంగపేట: మండలంలోని రమణక్కపేట గ్రామపంచాయతీ పరిధిలోని కొమరంభీం గిరిజన ఇసుక క్వారీ నుంచి నిబంధనలకు విరుద్దంగా ఇసుక దందా కొనసాగుతోందని ఆదివాసీ లిబరేషన్ ఫోర్స్ (ఏఎల్‌ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల సుమన్ సోమవారం ఆరోపించారు. కొమరంభీం ఇసుక క్వారీ పక్కనే వాడగూడెం పంచాయతీ పరిధిలోని రైతులకు చెందిన పట్టాభూముల పేరుతో ఇసుక క్వారీ నిర్వహణ సాగుతుందన్నారు. దీన్ని ఆసరా చేసుకున్న రైజింగ్ కాంట్రాక్టర్లు కొందరు రాజకీయ పెద్దల అండతో రమణక్కపేట కొమరంభీం ఇసుక క్వారీ పేరుతో ఆన్‌లైన్ పెట్టించుకుని పట్టా క్వారీలోని ఇసుకను అక్రమంగా లారీల్లో తరలిస్తుండగా పట్టుకున్నామని ఆయన ఆరోపించారు. ఇసుక క్వారీలపై సంబంధిత టీజీ ఎండీసీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇసుక దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. వాస్తవానికి కొమరంభీం ఇసుక క్వారీ సొసైటీకి గోదావరి నుంచి స్టాక్ పాయింట్‌కు ఇసుకను తరలించేందుకు ఈసీ పర్మిషన్ లేనప్పటికీ రాత్రి సమయాల్లో భారీ ప్రొక్‌లైన్ యంత్రాలతో తవ్వకాలు జరుపుతూ టి ప్పర్లతో స్టాక్ పాయింట్‌కు చేరవేస్తున్నారన్నారు. పట్టా భూములని చెప్పి గోదావరిలో నిబంధనలు పా టించకుంబా భారీ గోతులు తీసి ఇసుక త్వకాలు జరుపుతున్నారన్నారు. అధికారులు స్పందించి అ క్రమంగా అనుమతులు పొంది, గోదావరిలో తవ్వకాలు జరుపుతున్న క్వారీని నిలుపుదల చే సి అనుమతులు ఇచ్చిన రెవెన్యూ, వ్యవసాయ, మై నింగ్, టీఎస్ ఎండీసీ, భూగర్భజల శాఖ అ ధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment