రెండో రోజు ఇళ్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

రెండో రోజు ఇళ్ల పరిశీలన

Published Tue, Jan 28 2025 1:15 AM | Last Updated on Tue, Jan 28 2025 1:15 AM

రెండో రోజు ఇళ్ల పరిశీలన

రెండో రోజు ఇళ్ల పరిశీలన

మంగపేట : మండలంలోని పూరేడుపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేసేందుకు అర్హులైన లబ్ధిదారుల ఇళ్ల పరిశీలన సోమవారం కొనసాగింది. గ్రామంలోని 51 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరీ, ఆత్మీయ భరోసా 08 మంది, కొత్తరేషన్‌ కార్డులు 89 మందికి మంజూరీ పత్రాలను అందజేశారు. 516 ఎకరాలకు చెందిన 185 మంది రైతులకు రైతు భరోసా పథకం వర్తించినట్లు అధికారులు వెల్లడించారు. గ్రామంలో అత్యంత నిరుపేదలైన పూరిగుడిసె, గుడిసెలపై టార్ఫాలిన్‌ కప్పుకుని నివసించే వారందరికీ ఇళ్ల మంజూరీ ప త్రాలను అందచేయాలని జిల్లా కలెక్టర్‌ టీఎస్‌ దివా కర ఆదేశాల మేరకు సోమవారం ఎంపీడీఓ బద్రు, ఎంపీఓ మమత, పంచాయతీ కార్యదర్శి సుధారాణి ఇంటింటికి వెళ్లి 25 మందికి మంజూరీ పత్రాలను అందజేశారు. దీంతో లబ్ధిదారుల సంఖ్య 76కు చేరింది. మండలంలో ఇళ్ల మంజూరీలో దళారులు, రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ప్రత్యక్షంగా లబ్ధిదారులు ప్రస్తుతం నివసించే ఇళ్లను పరిశీలించి మంజూరీ చేస్తేనే అర్హులకు న్యాయం జరుగుతుందన్నారు. ఇదే తరహాలో ఇళ్లు మంజూరీ చేసే విధంగా మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement