పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి
వెంకటాపురం(ఎం): పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ టీఎస్ దివాకర అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 38 మంది తమ సమస్యలను పరిష్కరించాలని దరఖాస్తు చేసుకున్నారు. భూ సమస్యలపై 8, గృహ నిర్మాణ శాఖకు 7, పెన్షన్ 1, ఉపాధి కల్పనకు 2, ఇతర సమస్యలపై 20 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులనుద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నాలుగు పథకాలను అమలు చేయడంలో కృషి చేసిన ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. అర్హులైన పేదలకు పథకాలు అందించడంలో ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలన్నారు. ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు జరిగే మినీ మేడారం జాతరకు అ న్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా మౌలిక సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, ఆర్డీఓ వెంకటేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్ దివాకర
Comments
Please login to add a commentAdd a comment