ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం
ములుగు: కాంగ్రెస్ ప్రభుత్వం 420హామీలను ప్రజలకు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేస్తుందని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ హామీలపై గురువారం జిల్లా కేంద్రంలోని గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం అందించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేర్చడంలో విఫలం అయ్యారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికై నా మొద్దునిద్రను వీడి ప్రజల కోసం పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేష్‌రెడ్డి, మాజీ ఎంపీసీటీలు గొర్రె సమ్మయ్య, పోరిక విజయరాంనాయక్, నూనావత్ మహేశ్‌నాయక్, సాగర్, రఘు, రమణయ్య, బాబు, పాలెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నాగజ్యోతి
Comments
Please login to add a commentAdd a comment