![సరుకు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/31/31012025-mlg_tab-07_subgroupimage_1882270688_mr-1738267681-0.jpg.webp?itok=MBLLZD-J)
సరుకుల నాణ్యత పరిశీలన
వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని జీసీసీ గోదాములో ఆశ్రమ పాఠశాలలకు, వసతి గృహాలకు సరఫరా చేసే సరుకులను గురువారం హాస్టల్ వార్డెన్లు పరిశీలించారు. జీసీసీ గోదాము నుంచి వసతి గృహ, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు నిత్యావసర సరుకులు, సబ్బులు, నూనె, కందిపప్పు తదితర వస్తువులను సరఫరా చేస్తారు. ఈ సరుకుల నాణ్యతను ఆయా హాస్టళ్ల వార్డెన్లతో పాటు హెచ్‌ఎంలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, కె. రవీందర్, భారతి తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి
క్రీడా పోటీలకు ఎంపిక
ములుగు రూరల్: ములుగు మండలం కాశిందేవిపేటకు చెందిన యాట సురేష్ రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 28న హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి జావలిన్‌త్రో, డిస్కస్‌త్రోలో బంగారు పతకాలు, షాట్‌పుట్‌లో వెండి పతకం సాధించారు. దీంతో ఫిబ్రవరిలో చైన్నెలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ మేరకు సురేష్‌కు తెలంగాణ పారా అథ్లెటిక్స్ జనరల్ సెక్రటరీ పతకాలతో పాటు మెరిట్ సర్టిఫికెట్లు అందించి అభినందించారు.
యోగా గురువుకు సన్మానం
కన్నాయిగూడెం: మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో మూడు రోజుల యోగా శిక్షణ ఇచ్చిన గురువు రాంబాబును విద్యార్థులు, ఉపాధ్యాయులు గురువారం సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ వేణుగోపాల్ హాజరై మాట్లాడారు. యోగాతోనే రాజయోగం, ధనయోగంతో పాటు ఆరోగ్యంగా ఉంటామన్నారు. ప్రతిరోజూ దినచర్యలో భాగంగా యోగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దయాసాగర్, కృష్ణప్రసాద్, నల్లెబోయిన కోటయ్య, మంకిడి రాజశేఖర్, కృష్ణా, యుగేంధర్ తదితరులు పాల్గొన్నారు.
హత్య కేసులో
మరొకరి అరెస్ట్
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 26వ తేదీన భర్తకు పురుగుల మందు కలిపి భోజనం తినిపించి హత్య చేసిన కేసులో మరొకరిని అరెస్ట్ చేసినట్లు సీఐ నరేష్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలోని కాశీంపల్లి గ్రామానికి చెందిన కందుల సురేష్‌ను అతని భార్య స్వప్న హత్యచేసిన విషయం తెలిసిందే. భూపాలపల్లి పట్టణంలోని జవహర్‌నగర్‌కాలనీకి చెందిన కుంట్ల స్వామి మృతుడి భార్య స్వప్నకు సహకరించినట్లు తెలిపారు. వీరిద్దరు కలిసి ఒక పథకం ప్రకారం సురేష్‌ను హత్య చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కుంట్ల స్వామిని పట్టణంలోని బస్టాండ్ సమీపంలో అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.
![సరుకుల నాణ్యత పరిశీలన
1](https://www.sakshi.com/gallery_images/2025/01/31/30mul354-330124_mr-1738267681-1.jpg)
సరుకుల నాణ్యత పరిశీలన
![సరుకుల నాణ్యత పరిశీలన
2](https://www.sakshi.com/gallery_images/2025/01/31/30mul301-330137_mr-1738267681-2.jpg)
సరుకుల నాణ్యత పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment