![బాధితులకు అండగా భరోసా కేంద్రం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06mul03-330117_mr-1738870574-0.jpg.webp?itok=il6T9f0F)
బాధితులకు అండగా భరోసా కేంద్రం
ములుగు: బాధిత మహిళలకు భరోసా కేంద్రం ఎల్లవేళలా అండగా ఉంటుందని డీఎస్పీ, డీసీఆర్‌బీ(డిస్ట్రిక్ క్రైం రికార్డ్సు బ్యూరో) కిశోర్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రం ఏర్పాటు చేసి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఉద్యోగులు, పోలీసులతో కలిసి వార్షికోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల రక్షణకు ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలు మహిళల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచడానికి తోడ్పాటును అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలు, యువతులు, వృద్ధులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులతో పాటు తదితర సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వన్ స్టాఫ్ సొల్యూషన్‌గా పని చేస్తున్నాయని తెలిపారు. మహిళలు సమాజంలోఎదుర్కొంటున్న సమస్యలపై కౌన్సెలింగ్ నిర్వహించి ధైర్యాన్ని పెంపొందించేందుకు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రం ఎస్పీ పర్యవేక్షణలో సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భరోసా కేంద్రం జిల్లా ఇన్‌చార్జ్, ఎస్సై ఎన్.స్రవంతి, సెంటర్ కో ఆర్డినేటర్ అనూష, సిబ్బంది అవగాహన సదస్సులు నిర్వహిస్తూ మహిళలు, యువతులు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు.
డీఎస్పీ కిశోర్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment