![గిట్ట](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/03mul052r-330123_mr-1738870574-0.jpg.webp?itok=rzJe-uta)
గిట్టుబాటు ధర చెల్లించాలి..
ఎండుమిర్చికి ప్రభుత్వం గిట్టుబాటు ధర చెల్లించాలి. మార్కెట్‌లో మిర్చిని కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు చేయాలి. గతేడాది ఏసీల్లో (నిల్వ) పెట్టిన రైతులు చాలా మంది నష్టపోయారు. రైతులు చాలా పెట్టుబడి పెట్టి మిర్చి పంటలను సాగు చేస్తున్నారు. తెగుళ్లు సోకి పెట్టుబడి పెరిగింది. ఈ సారి మంచి ధరకు ఎండు మిర్చికి కొనుగోలు చేసి ఆదుకోవాలి.
– గడబోయిన శ్రీకాంత్, రాంనగర్, ఏటూరునాగారం
అధికారుల సూచనలు పాటించాలి..
ల్యామ్డా, అసిఫేట్, బైఫిరాన్‌తోపాటు తెగులు మందు కలిపి పిచికారీ చేయాలి. ఎకరంలో 20 నుంచి 30 వరకు జిగురు అట్టలను అమర్చాలి. దానివల్ల పురుగు శాతాన్ని అదుపుచేయవచ్చు. రైతులు హార్టికల్చర్ అధికారుల సూచనలు, సలహాలను పాటించి మిర్చి దిగుబడిని పెంచుకోవాలి.
– శ్రీకాంత్, జిల్లా హార్టికల్చర్ అధికారి
నల్లివ్యాధితో నష్టం..
నల్లి వ్యాధి సోకి పంట దిగుబడి అధికంగా తగ్గింది. ఏఈఓలు, వ్యవసాయ అధికారులు, హార్టికల్చర్ అధికారులు పంటలను పరిశీలించడం లేదు. కేవలం కార్యాలయాలకే పరిమితం అవుతున్నారు. రెండు ఎకరాలు సాగు చేస్తే ఏడు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. తెగుళ్లతో దిగుబడి అధికంగా తగ్గింది. మార్కెట్లలో చాలా తక్కువ ధర పలుకుతోంది.
– ఎగ్గడి వెంకటేశ్వర్లు, ఏటూరునాగారం
![గిట్టుబాటు ధర చెల్లించాలి..
1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06mul063-330123_mr-1738870574-1.jpg)
గిట్టుబాటు ధర చెల్లించాలి..
![గిట్టుబాటు ధర చెల్లించాలి..
2](https://www.sakshi.com/gallery_images/2025/02/7/03mul059-330123_mr-1738870574-2.jpg)
గిట్టుబాటు ధర చెల్లించాలి..
Comments
Please login to add a commentAdd a comment