15 రోజులపాటు చికిత్స.. దక్కని ప్రాణం
కన్నాయిగూడెం: మండల పరిధిలోని బుట్టాయిగూడెం గ్రామ పంచాయతీలోని కొత్తూర్ గ్రామానికి చెందిన కుమ్మరి నాగేశ్వర్ రావు (41) ఇందిరమ్మ ఇల్లు రాలేదని అధికారులు ఏర్పాటు చేసిన గ్రామసభలోనే పురుగుల మందు తాగిన విషయం తెలిసిందే. 15 రోజులు మృత్యువుతో పోరాడి బుధవారం అర్ధరాత్రి వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో పరిస్థితి విషమించి మృతిచెందాడు. మృతుడి కూతురు షాలిని తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 23న బుట్టాయిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామసభలో అధికారులు ప్రదర్శించిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో నాగేశ్వర్‌రావు పేరు లేకపోవడంతో ఆవేదనకు గురై అక్కడే పురుగుల మందు తాగాడు. వెంటనే అక్కడున్న వారు 108లో ఏటూరునాగారం తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం ములుగు ఏరియా వైద్యశాలకు, ఆ తర్వాత హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యఖర్చులకు ఉన్న భూమిని కుదవపెట్టారు. సరిపోకపోవడంతో బుధవారం వరంగల్ ఎంజీఎంకి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 2 గంటలకు మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. సాయంత్రం గ్రామంలో నాగేశ్వర్‌రావు అంత్యక్రియలు నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏటూరునాగారం సీఐ శ్రీనువాస్, ఎస్సైలు వెంకటేష్, సురేష్‌లు బందోబస్తు నిర్వహించారు. అంత్యక్రియల నిమిత్తం ములుగు ఆర్డీఓ రూ.50వేల ఆర్థికసాయం అందించారు.
ఇందిరమ్మ ఇల్లు రాలేదని గ్రామసభలో పురుగుల మందు తాగిన వ్యక్తి మృతి
కుటుంబాన్ని ఆదుకుంటామని
మంత్రి ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment