![మండమెలిగె పండుగే మినీ మేడారం..](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06mul107-330120_mr-1738870572-0.jpg.webp?itok=PGZfQhR0)
మండమెలిగె పండుగే మినీ మేడారం..
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వా యి మండలంలోని మేడారంలో ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు మినీ జాతర (మండమెలిగె పండుగ. అనగా పసుపు, కుంకుమ రూపంలో సమ్మక్క తల్లిని గుడి నుంచి గద్దైపెకి తీసుకొచ్చి పూజలు నిర్వహించి రాత్రంతా జాగారం ఉండడం) నిర్వహించనున్నారు. ప్రతి రెండేళ్లకోసారి ఫిబ్రవరిలో మహాజాతర జరగుతుంది. ఈ క్రమంలో ఏడాది మధ్యలో మినీ జాతర నిర్వహిస్తారు. మహాజాతర సమయంలో గుడిమెలిగె పండుగ నుంచి వన ప్రవేశం వరకు పూజ కార్యక్రమాలు నిర్వహించగా.. మినీ జాతరలో మాత్రం మండమెలిగె పండుగతో పూజ కార్యక్రమాలు పరిసమాప్తమవుతాయి.
మహాజాతరలో ఇలా..
మహాజాతరలో గుడిమెలిగె పండుగ నుంచి తల్లుల వనం ప్రవేశం వరకు అమ్మవార్లకు పూజలు చేస్తారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మహాజాతరలో మండమెలిగె పండుగకు వారం రోజులు ముందు సమ్మక్క పూజారులు గుడిమెలిగె పండుగ నిర్వహిస్తారు. మళ్లీ వారం తర్వాత మండమెలిగె పండుగ చేస్తారు. ఈపండుగ జరిగిన వారం తర్వాత కన్నెపల్లి నుంచి సారలమ్మ, చిలకలగుట్ట నుంచి సమ్మక్కతల్లిని గద్దైపెకి తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు. అంతేకాకుండా సమ్మక్క తల్లి గద్దైపెకి వచ్చే రోజు ఉదయం వనం తీసుకొచ్చి గద్దైపె ప్రతిష్ఠిస్తారు. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులను కూడా మేడారం గద్దెలపైకి తీసుకొస్తారు. మొక్కుల అనంతరం అమ్మవార్ల వనప్రవేశంతో మహాజాతర ముగుస్తుంది.
మినీ జాతరలో పూజా కార్యక్రమాలు ..
మహాజాతర జరిగిన ఏడాది తర్వాత పూజారులు మినీ జాతర (మండమెలిగె పండుగ) నిర్వహిస్తారు. మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో మండమెలిగె పండుగకు వారం ముందు గుడిమెలిగె పండుగను నిర్వహిస్తారు. వారం తర్వాత మండమెలిగె పండుగ జరుగుతుంది. బుధ, గురువారం రెండు రోజుల్లో మండమెలిగె పండుగ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మినీ జాతరలో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు,గోవిందరాజులను గద్దెలపైకి తీసుకురావడం, వనం ప్రవేశం లాంటి పూజ కార్యక్రమాలను ఉండవు. మండమెలిగె పండుగతోనే మినీ జాతర పూజ కార్యక్రమాలు ముగిస్తాయి.
మహాజాతర ముగిసిన
ఏడాది మధ్యలో నిర్వహణ
ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు జాతర
Comments
Please login to add a commentAdd a comment