సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె
ములుగు రూరల్: జిల్లాలోని రెండో ఏఎన్‌ఎంల సమస్యలను ఈ నెల 17వ తేదీ వరకు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు వెళ్తామని ఆ సంఘం అధ్యక్షురాలు సుజాత, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. ఈ మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా చేపట్టారు. అనంతరం డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ రెగ్యులర్ చేయడం లేదన్నారు. అనేక పోరాటాల చేయగా గ్రాస్ సాలరీ ఇస్తామని హామీ ఇచ్చి మరిచారని తెలిపారు. అందుకే 100శాతం గ్రాస్ సాలరీ వెంటనే అమలు చేయడంతో పాటు రూ.10లక్షల లైఫ్ టైం గ్రాట్యుటీ, హెల్త్ ఇన్యూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, ఏడు నెలల పీఆర్‌సీ ఏరియర్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను ఈ నెల 17వ తేదీ వరకు స్పందించకపోతే సమ్మెకు వెళ్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కన్వీనర్ అమ్జద్‌పాషా, నాయకులు సరోజన, పావని, మమత, సరోజిని, శోభారాణి, స్వప్న, సరిత, సరస్వతి, పుణ్యవతి, లలిత, సూర్యకాంతం, సమ్మక్క, సబిత, కవిత, లక్ష్మీ పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావుకు వినతి పత్రం
అందజేసిన రెండో ఏఎన్‌ఎంలు
Comments
Please login to add a commentAdd a comment