మల్లంపల్లిలో తాగునీరు కలుషితం
ములుగు: మల్లంపల్లిలో సరఫరా అవుతున్న తాగునీరు పలుచోట్ల కలుషితం అవుతుందని గుర్తించినట్లు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం పబ్లిక్ హెల్త్ లేబోరేటరీ సివిల్ సర్జన్, బ్యాక్టీరియాలజిస్ట్ డాక్టర్ కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం మండల కేంద్రంలో వైద్యబృందం పర్యటించింది. మల్లంపల్లి, మంచినీళ్లపల్లి, కుమ్మరిపల్లి, హ్యూమాయి నగర్ గ్రామాల్లోని తాగునీటిని వైద్యులు ల్యాబ్‌లో టెస్ట్ చేసిన రిపోర్టులను స్థానికులకు తెలి యజేశారు. దీనికి సంబంధించిన రిపోర్టులను మల్లంపల్లి గ్రామ పంచాయతీ అధికారులకు పంపించినట్లు వెల్లడించారు. కలుషితమయ్యే నీటి ప్రాంతాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం సొసైటీ డైరెక్టర్ గూడెపు ఇందిరా రాజిరెడ్డి, మల్లంపల్లి మండల సాధన కమిటీ అధ్యక్షుడు గోల్కోండ రాజు, జిల్లా కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి దేవేంద్ర చారి, జిల్లా ఎస్సీ సెల్ ఉపాద్యక్షుడు తాళ్లపెల్లి సాంబయ్య, అంకం సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆలయంలో అభిషేక పూజలు
మంగపేట: మండల పరిధిలోని బోరునర్సాపురంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో కొనసాగుతున్న 18వ వార్షికోత్సవ మూడోరోజు కార్యక్రమంలో బాగంగా గురువారం అభిషేక పూజలు నిర్వహించారు. ఉద యం 8నుంచి 9గంటల వరకు స్వామి వారికి అభిషేక పూజలు నిర్వహించారు. 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సుదర్శనవనం (హోమం) పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరాగా పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.
అడవుల సంరక్షణకు
పాటుపడాలి
వాజేడు: అడవులు ప్రగతికి ముఖ్యమైనవని వాటి సంరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని ఎఫ్‌ఎస్‌ఓలు నాగమణి, నారాయణ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని కడేకల్, ముత్తారం కాలనీ గ్రామాల్లో గురువారం ప్రజలకు అవగాహన కల్పించారు. అడవులతో ప్రజలకు, జంతువులకు కలిగే ప్రయోజనాలపై వివరించారు. అడవుల్లో పొరపాటున కూడా మంటలు పెట్టవద్దని కోరారు. ఒక వేల అడవిలో మంటలు చెలరేగితే స్థానికులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పాటు మంటలను ఆర్పడానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment