హుండీ ఆదాయం రూ.6.80లక్షలు
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప ఆలయ హుండీ కానుకాలను గురువారం లెక్కించగా రూ.6,80,987ల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ బిల్లా శ్రీనివాస్ తెలిపారు. మూడు నెలలుగా పర్యాటకులు, భక్తులు హుండీలలో వేసిన కానుకాలను లెక్కించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్, గైడ్‌లు విజయ్‌కుమార్, వెంకటేశ్, ఆలయ సిబ్బంది సంతోష్, ఆవినాష్‌రెడ్డి, దామోదర్, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.
కోటగుళ్లను సందర్శించిన
బ్రిటన్ దేశస్తుడు
గణపురం: గణపురం మండలకేంద్రంలోని కోటగుళ్లను బ్రిటన్ దేశానికి చెందిన రోజ్ మెల్విన్ గురువారం సందర్శించారు. ఆయన కాకతీయుల ఆలయాలపై పరిశోధన చేస్తూ హనుమకొండలోని వేయి స్తంభాల గుడి, ఫోర్ట్ వరంగల్, రామప్ప ఆలయాలను సందర్శిస్తూ గణపురం కోటగుళ్లను సందర్శించి వాటి చరిత్రను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయుల శిల్ప సంపద ఎంతో అద్భుతంగా ఉందన్నారు. ఆయన వెంట పర్యాటక శాఖ అసిస్టెంట్ ప్రమోషన్ అధికారి డాక్టర్ కుసుమ సూర్యకిరణ్, పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మల్లు నాయక్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment