వ్యవసాయ మార్కెట్‌లలో వేరుశనగ విక్రయించేందుకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులకు మద్దతు ధర తదితర అంశాలపై మార్కెట్ కమిటీ చైర్మన్లు, మార్కెటింగ్ శాఖ అధికారులతో బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్ నుంచి గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్కెట్ పాలకవర్గాలు, అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. జిల్లాలో వేరుశనగ పంటకు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 6,783 అందించాలని తెలిపారు. రైతుల అవసరాలను తీర్చడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో వేరుశనగ సాగు విస్తీర్ణం.. కొనుగోలు అంశాలపై పూర్తి అవగాహనతో ఉండాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment