కల్వకుర్తి టౌన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలను మెరుపరిచేందుకు ప్రతిఏటా అందించే కాయకల్ప టీం సభ్యులు సోమవారం సీహెచ్‌సీని పరిశీలించారు. కాయకల్పలో భాగంగా పీర్ అసెస్‌మెంట్ టీం సభ్యులు ఆస్పత్రిని పరిశీలించి.. పలు వివరాలు సేకరించారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించిన బృందం సభ్యులు ఇందిర రోగులకు అందిస్తున్న వైద్యసేవల గురించి ఆరాతీశారు. ముఖ్యంగా మెటర్నిటీ వార్డులో ఉన్న లేబర్ రూం, ఆపరేషన్ థియేటర్, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవల వివరాలను పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలోని బయో మెడికల్ వేస్టేజ్, పారిశుద్ధ్య నిర్వహణ, ఆస్పత్రి అభివృదికి తీసుకుంటున్న చర్యలు, ఆస్పత్రికి వచ్చే రోగుల వివరాలు తదితర అంశాలను సేకరించి నమోదు చేసుకున్నారు. వైద్యుల బృందంతోపాటు ఆస్పత్రి సూపరింటెండెంట్ శివరాం, వైద్యులు విష్ణు, ఉదయ్, షకీల్, హెడ్‌నర్సు సునీత పాల్గొన్నారు.