తాగు నీటి సమస్య తలెత్తకుండా చూడాలి
ఫ జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య
కేతేపల్లి: ప్రస్తుత వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా సంబంధిత అధికారులు ముందుస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య అన్నారు. గురువారం కేతేపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రిపేరులో ఉన్న బోర్లకు వెంటనే మరమ్మతులు చేయాలని, గ్రామాల్లో వంద శాతం పన్నులను వసూలు చేయాలని ఆదేశించారు. అనంతరం మండలంలోని చీకటిగూడెం గ్రామ పంచాయితీ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంపీఓ నాగలక్ష్మి, మిషన్ భగీరథ ఏఈఈ సాయికుమార్, ఏపీఓ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment