
ఆస్తిపన్ను వడ్డీపై 90 శాతం మాఫీ
నల్లగొండ టూటౌన్: మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను బకాయిల వడ్డీపై 90 శాతం మాఫీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని సంవత్సరాల నుంచి ఆస్తిపన్ను చెల్లించకుండా బకాయి పడ్డవారు ఈనెల 31లోగా మొత్తం ఆస్తిపన్ను చెల్లిస్తే 90 శాతం వడ్డీ రాయితీ అవకాశం కల్పించింది. ఇప్పటికే వడ్డీతో సహా ఆస్తిపన్ను చెల్లించిన వారికి వచ్చే ఏడాది 90 శాతం వడ్డీ తగ్గించనున్నారు. వెంటనే ఆస్తిపన్ను చెల్లించి వడ్డీ రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనిచాలని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ కోరారు.