నంద్యాల(వ్యవసాయం): జిల్లాలో పారా లీగల్ వలంటీర్ల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నంద్యాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు వాసుబాబు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, ఆత్మకూరు, డోన్, నందికొట్కూరు కోర్టుల పరిధిలో పారా లీగల్ వలంటీర్ల నియామకం చేపడుతున్నట్లు వెల్లడించారు. కనీస విద్యార్హత పదవ తరగతి పాస్ అయి ఉండాలన్నారు. జిల్లాకు చెందిన ప్రైవేట్ ఉపాధ్యాయులు, పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, అంగన్వాడీ కార్యకర్తలు, వైద్యులు, న్యాయ విద్యార్థులు రాజకీయేతర సభ్యులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆయా కోర్టుల పరిధిలోని మండల లీగల్‌సెల్ కార్యాలయాల్లో ఫిబ్రవరి 5వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తులు స్వీకరించ బడుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment