మాదక ద్రవ్యాల నివారణకు పటిష్ట చర్యలు | - | Sakshi
Sakshi News home page

మాదక ద్రవ్యాల నివారణకు పటిష్ట చర్యలు

Published Thu, Jan 30 2025 1:47 AM | Last Updated on Thu, Jan 30 2025 1:46 AM

మాదక ద్రవ్యాల నివారణకు పటిష్ట చర్యలు

మాదక ద్రవ్యాల నివారణకు పటిష్ట చర్యలు

నంద్యాల: జిల్లాలో పూర్తిస్థాయిలో మాదక ద్రవ్యాల రవాణా, వినియోగాన్ని నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో మాదక ద్రవ్యాల జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. అడిషనల్‌ ఎస్పీ మంద జావలి అల్ఫోన్సా, డీఆర్‌ఓ రాము నాయక్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా వాటి వినియోగంతో కలిగే అనర్థాలపై విస్తృ

త అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో డి అడిక్షన్‌ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని 1957 పాఠశాలలు, 49 కళాశాలలు, 196 ప్రభుత్వ, ప్రభుత్వేతర విద్యాసంస్థల విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై చైతన్య పరచాలన్నారు. జిల్లాలోని పలు ఫ్యాక్టరీల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు పనిచేస్తున్నారని, వారు గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణా, వినియోగం చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫ్యాక్టరీల యజమానులు తనిఖీలు కూడా చేయాలన్నారు. డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మెడికల్‌షాపుల్లో నిద్ర మాత్రలు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మల్బరీ, బంతిపూలు, మిర్చి తదితర పంటల సాగులో గంజాయి పండించే ప్రమాదం ఉందని, పరిశీలించాలని చెప్పారు. శివరాత్రిని పురస్కరించుకొని జిల్లాలోని శైవ క్షేత్రాల్లో సాధువులు, స్వాములు మాదకద్రవ్యాలు వినియోగించే అవకాశం ఉందని, కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వాటి రవాణా జరగకుండా నిఘా ఉంచాలన్నారు. సమావేశంలో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ రవికుమార్‌, నంద్యాల, ఆత్మకూరు ఆర్‌డీఓలు విశ్వనాథ్‌, నాగజ్యోతి, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అధికారులకు జిల్లా కలెక్టర్‌

రాజకుమారి ఆదేశం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement