శాస్త్రోక్తంగా నారసింహస్వామి దీక్ష విరమణ
ఆళ్లగడ్డ: 41 రోజులు నియమ నిష్టలతో కఠోరమైన దీక్ష చేపట్టిన అహోబిల లక్ష్మీనారసింహ స్వామి భక్తులు సోమవారం భక్తి శ్రద్ధలతో దీక్ష విరమణ చేశారు. దీక్ష చేపట్టి మండలం పూర్తి కావడంతో దీక్ష విరమించేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఇరుముడి కట్టుకుని కాలినడకన అహోబిలం క్షేత్రం చేరుకున్నారు. తెల్లవారు జామున ఎగువ, దిగువ అహోబిల ఆలయాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించి కాలినడకన మాలోల లక్ష్మీనరసింహస్వామి సన్నిధికి చేరుకుని ఇరుముడి సమర్పించి దీక్ష విరమించారు. అనంతరం వేదపండితులు ఆలయ సమీపంలో నిర్వహించిన సుదర్శన హోమంలో పాల్గొన్నారు. దీక్షాపరులతో పాటు వారి కుటుంబ సభ్యులు తండోపతండాలుగా తరలిరావడంతో అహోబిలం క్షేత్రం గోవింద నామస్మరణతో పులకించి పోయింది.
Comments
Please login to add a commentAdd a comment