శ్రీశైలం.. శివమయం
శివభక్తులతో శ్రీగిరి నిండిపోయింది. ఎటు చూసినా శివభక్తుల భజనలు, శివనామస్మరణలు, పూజలతో శ్రీగిరి క్షేత్రం మారుమోగుతోంది. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతం మీదుగా భక్తులు పాదయాత్రగా వస్తున్నారు. వృద్ధులు, మహిళలు, చంటిపిల్లల తల్లులు సైతం ఎండను లెక్క చేయకుండా కదలివస్తున్నారు. పాతాళగంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, కృష్ణమ్మకు వాయనం సమర్పిస్తున్నారు. అనంతరం క్యూలైన్ల వద్దకు చేరుకుని శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్తున్నారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లన్నీ నిండిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment