ఆత్మీయ కలయిక.. ఆనంద వేడుక
వారంతా 1975లో పోలీస్ శిక్షణ పొందిన వారు. 50 సంవత్సరాల తర్వాత ఒక చోట కలుసుకున్నారు. అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. అలనాటి జ్ఞాపకాలను ఆనందంగా పంచుకున్నారు. విధి నిర్వహణలో ఎదుర్కొన్న సవాళ్లు, అనుభవాలను మిత్రులకు చెప్పారు. ఈ అ‘పూర్వ’ కలయికకు మంగళవారం కర్నూలు కొత్తపేటలోని పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ దగ్గర ఉన్న విశ్రాంత పోలీసు అధికారుల భవనం వేదిక అయ్యింది. వీరంతా హైదరాబాద్ అంబర్‌పేట ట్రైనింగ్ సెంటర్‌లో 1975లో శిక్షణ పొందారు. సుదీర్ఘ కాలం పాటు పోలీసు శాఖలో పనిచేస్తూ వివిధ హోదాల్లో పదోన్నతి పొంది పదవీ విరమణ చేశారు. ఆత్మీయతతో ఒక చోట చేరి మిత్రులను పలకరించారు. యోగక్షేమ విషయాలు తెలసుకున్నారు. క్రమశిక్షణను గుర్తు చేసుకుంటూ హాస్యాన్ని పండించారు. – కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment