ప్యాపిలి: స్థానిక పెట్రోల్ బంకు వద్ద సోమవారం రాత్రి జేసీబీ ఢీకొని ప్యాపిలికి చెందిన వడ్డే గోపాల్ (56) మృతి చెందాడు. పని మీద బయట కు వచ్చిన అతను ఇంటికెళ్తుండగా ప్రమాదవశాత్తూ జేసీబీ ఢీకొనడంతో కింద పడ్డాడు. అతనిపై జేసీబీ టైర్లు ఎక్కడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు వెంటనే చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
టమాట ఆటో బోల్తా
బనగానపల్లె రూరల్: యాగంటిపల్లె సమీపంలోని గాలేరు–నగరి సుజల స్రవంతి కాల్వ సమీపంలో టామాట లోడ్డుతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఆళ్లగడ్డకు చెందిన ఆటో డ్రైవర్ శివ వివరాల మేరకు.. మంగళవారం పసుపల గ్రామం నుంచి టమాట బాక్సులు వేసుకుని ట్రాలీ ఆటో బనగానపల్లె వైపు వస్తోంది. యాగంటిపల్లె సమీపంలోని జీఎన్‌ఎస్‌ఎస్ కాల్వ వద్ద ఎదురుగా వస్తున్న బర్రెలను తప్పించబోయి ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కలో లోతైన గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంతో శివకు స్వల్ప గాయాలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment