బొమ్మలసత్రం: నంద్యాల మండలం ఊడుమాల్పురం గ్రామ సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో పాణ్యం మండలం తొగర్చేడు గ్రామానికి చెందిన నాగమ్మ (48) దుర్మరణం చెందింది. ట్రాఫిక్ సీఐ మల్లికార్జునగుప్తా తెలిపిన వివరాల మేరకు.. తొగడ్చేడు గ్రామానికి చెందిన 30 మంది మహిళా కూలీలు మంగళవారం పొగాకు కోసేందుకు ఊడుమాల్పురం గ్రామానికి ట్రాక్టర్‌లో చేరుకున్నారు. పని ముగించుకుని సాయంత్రం తిరిగి వెళ్తుండగా ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నాగమ్మ అక్కడికక్కడే మృతి చెందగా 10 మంది గాయపడ్డారు. గాయపడిన కూలీలను చాపిరేవుల పీహెచ్‌సీ సెంటర్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. మృతురాలి కుమార్తె అనిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment