● 300 మీటర్ల దూరంలో పంపిణీ
కర్నూలు(అగ్రికల్చర్): ఇంటి దగ్గర పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. లబ్ధిదారుల ఇళ్లను జియో ట్యాగింగ్ చేయగా.. ఇంటి నుంచి 300 మీటర్ల( మూడు పర్లాంగులు) దూరంలో పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంది. 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పంపిణీ చేస్తుంటే కారణాలను యాప్‌లో నమోదు చేయాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని మార్చి 1న చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో పైలెట్‌గా ప్రారంభించనున్నారు. జిల్లాలో ఇంతవరకు ఒక్క సచివాలయంలో కూడా 100 శాతం ఇంటిదగ్గర పింఛన్‌లు పంపిణీ చేయలేదు. గ్రామ, వార్డు సచివాలయాలు, రచ్చబండల దగ్గరే పంపిణీ సాగుతోంది. మార్చి నెలకు సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4,53,829 పింఛన్లకు రూ.195.28 కోట్లు మంజూరు అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment