గిరిజనులు నన్నారి సాగులో రాణించాలి
ఆత్మకూరు: చెంచు గిరిజనులు నన్నారి సాగులో రాణించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా సూచించారు. బైర్లూటీ చెంచుగూడెంలో చెంచు గిరిజనులతో శుక్రవారం కలెక్టర్ సమావేశమ య్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనులు నల్లమల అటవీ పరిధిలో నన్నారి సాగుచేసి ఆర్థికంగా ఎదగాలని కోరారు. నన్నారి సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తున్నాయన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో అవగాహన, శిక్షణ ఇస్తుందన్నారు. మొక్కల పెంపకం, మార్కెట్ అవకాశాలు కూడా కల్పిస్తుందన్నారు. చెంచులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం గిరిజనులతో పంట సాగు విధానం, నన్నారి తయారీ తదితర వివరాలను ఆమె గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్ మీడియెట్ వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నా యి. జిల్లాలో పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. మార్చి 1వ తేదీ నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులు, 3వ తేదీ నుంచి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు రాయనున్నారు. మార్చి 20వ తేదీ వరకూ కొనసాగుతాయి. జిల్లాకు చేరిన మూడు సెట్ల ప్రశ్నపత్రాలను ఆయా పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు. మొత్తం 53 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 28,742 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 15,731 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 13,011 మంది ఉన్నారు. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఎవరైనా లీక్ చేస్తే కచ్చితంగా దొరికిపోతారు. ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్షల సమయంలో ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకునేందుకు ఇంటర్ బోర్డ్ డీఐఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్ 9441235307కు ఫోన్ చేయవచ్చునని డీఐఈఓ సునిత తెలిపారు.
నేడు ప్రధాని వెబ్‌నార్
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయం, గ్రామీణ శ్రేయస్సుపై శనివారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వెబ్‌నార్ నిర్వహించనున్నారని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్‌డీఎం) ఎస్‌ఆర్ రామచంద్రరావు శుక్రవారం ఒకప్రకటనలో తెలిపారు. కర్నూలులోని ఉద్యానభవన్‌లో శనివారం ఉద యం 10 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు వెబ్‌నార్ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రైతులతో ప్రధాని ముఖాముఖి అవుతారని తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ) ద్వారా పంపిణీ చేసే వ్యవసాయ రుణ రాయితీ రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచుతూ కేంద్ర ప్రభు త్వం ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. వెబ్‌నార్‌లో నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి, అధికారులు, రైతులు పాల్గొంటారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment