రమణీయం.. తెప్పోత్సవం
మహానంది: శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర స్వామికి శనివారం రాత్రి రుద్రగుండం కోనేరులో తెప్పోత్సవం నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో ఉత్సవాన్ని భక్తులు తిలకరించారు. దాతలు ఏజీఎన్ జ్యువెలర్స్ అధినేత అవ్వారు గౌరీనాథ్, సరస్వతి, అవ్వారు గౌతం, పవిత్ర దంపతులను సన్మానించి ప్రసాదాలు అందించారు. ఇదిలా ఉండగా.. క్షేత్రంలో ఎనిమిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, నాగేశ్వరశర్మ, శాంతారాంభట్, హనుమంతుశర్మ, ముఖ్య అర్చకులు రాజమాణిక్యశర్మ, మణికంఠశర్మ, రుత్వికుల బృందం ఆధ్వర్యంలో స్థానిక యాగశాలలో ఉదయం నుంచి మహాపూర్ణాహుతి పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. యాగఫల సమర్పణ, మహానందీశుడి దంపతులకు కంకణ విసర్జన, చండీశ్వరుడు, త్రిశూలుడికి త్రిశూల స్నానం పూజలను స్థానిక రుద్రగుండం కోనేరులో చేపట్టారు. పెళ్లిపెద్దలైన శ్రీ పార్వతీ సమేత బ్రహ్మనందీశ్వరస్వామి వారి దంపతులతో పాటు మహానందీశ్వరుడి దంపతులను ప్రదక్షిణ గావించి తిరిగి అలంకార మండపానికి చేర్చారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ధ్వజావరోహణ చేశారు. అలంకార మండపం వద్ద నాకబలి పూజలు జరిపారు. ఆలయ ఏఈఓ ఎరమల మధు, ఆలయ, కార్యాలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్‌రెడ్డి, దేవిక, కల్యా ణోత్సవ దాత కుర్రా వెంకయ్య చౌదరి సతీమణి కు ర్రా జయలక్ష్మీ, ఎస్‌ఐ రామమోహన్‌రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు చిన్నా, శ్రీనివాసులు పాల్గొన్నారు.
మహానందిలో
శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి
రమణీయం.. తెప్పోత్సవం
రమణీయం.. తెప్పోత్సవం
Comments
Please login to add a commentAdd a comment