రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పేదల సొంతింటి కలను దూరం చే
● అందని ఉచిత ఇసుక
● నిలిచిన చౌకట్లు, కిటికీల సరఫరా
● రాయితీ సిమెంట్‌కు మంగళం
● గతంలో కేటాయించిన
ఇళ్ల నిర్మాణాలకు అడ్డంకులు
● ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు అమలుకాని
బిల్లు పెంపు
● కొత్తగా గృహాల మంజూరును
పట్టించుకోని ‘కూటమి’ ప్రభుత్వం
కోవెలకుంట్ల: పేదలకు గృహ కల సాకారం చేయాలన్న ఉద్దేశ్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించింది. లబ్ధిదారులకు అన్ని విధాలా అండగా నిలిచింది. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 323 జగనన్న కాలనీలను ఏర్పాటు చేయించింది. సొంత స్థలం ఉన్న లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేందుకు 56,523 పక్కాగృహాలు కేటాయించింది. గత ఏడాది మార్చి నాటికి ఆయా మండలాల్లో 30,713 పక్కాగృహాలు పూర్తి కాగా 15వేల ఇళ్లు బేస్‌మెంట్, మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక, సిమెంట్, ఇతర ఇంటి సామగ్రి సరఫరా కాకపోవడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు
అమలు కాని బిల్లు పెంపు
ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి సిమెంట్, ఇసుక, ఇంటి నిర్మాణ సామగ్రి సరఫరా నిలిచిపోయింది. కొత్తగా పక్కాగృహాల మంజూరైన లబ్ధిదారులకు రూ. 2.50 లక్షల బిల్లులు చెల్లిస్తామని ప్రకటించగా జిల్లాలో వేలాది మంది పేద ప్రజలు ఇళ్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో మంజూరై వివిధ దశల్లో ఉన్న ఇళ్లకు గత ప్రభుత్వం మంజూరు చేసిన బిల్లులు చెల్లిస్తున్నారు. వీరిలో ఎస్టీ లబ్ధిదారులకు రూ. 75 వేలు, ఎస్సీ లబ్ధిదారులకు రూ. 50 వేలు అదనంగా చెల్లిస్తామని జీఓ విడుదల చేసింది. పెంచిన మొత్తాన్ని ఇప్పటి వరకు విడుదల చేయకపోవడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని ఇసుక, సిమెంట్, ఇంటి సామగ్రి సరఫరా చేయడంతోపాటు కొత్తగా పక్కాగృహాలు మంజూరు చేసి పేదలకు సొంతింటి కల నెరవేర్చాలని కోరుతున్నారు.
కుట్రలు ఇలా..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఇళ్లస్థలాలు, పక్కాగృహాలు మంజూరు చేయలేదు. పైగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జగనన్న కాలనీల్లో మంజూరు చేసిన ఇళ్ల స్థలాలను ఆక్రమించుకునేందుకు టీడీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటి స్థలాలు మంజూరై ఇళ్ల నిర్మాణం ప్రారంభించని వాటిని రద్దు చేసేందుకు గత నెల 25వ తేదీన ప్రభుత్వం ప్రత్యేక జీఓ విడుదల చేసింది. ఇందుకోసం ఇటీవల 16 కాలమ్స్ కూడిన యాప్ విడుదల చేసింది. ఈ యాప్‌లో లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల స్థలాల వివరాలు పొందుపరిచి ఉన్నాయి. ఆయా కాలనీల్లో ఇప్పటికే కొందరు లబ్ధిదారులు నిర్మాణాలు పూర్తి చేసి ఆ ఇళ్లలో నివాసం ఉంటున్నారు. మరికొన్ని ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని ఇళ్లు బేస్‌మెంట్, ఇంకొన్ని ఖాళీ స్థలాలుగా ఉన్నాయి. సర్వే ఆధారంగా వీటిని ఏం చేస్తారన్నది లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ఆయా కాలనీల్లో ఖాళీ స్థలాలను ఆక్రమించుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నేటి దుస్థితి ఇదీ..
● నిరుపేదలను గుర్తించి ఇంటి స్థలంతో పాటు మూడు విడతల్లో రూ.1.80 లక్షల బిల్లులు అందజేశారు.
● ఉచితంగా 20 టన్నుల ఇసుక, రాయితీపై సిమెంట్, కడ్డీలు, గృహ నిర్మాణ సామగ్రి ఇచ్చారు.
● బేస్‌మేట్ వేసుకునేందుకు చేతిలో డబ్బులులేని లబ్ధిదారులకు వైఎస్సార్ క్రాంతి పథం ద్వారా హౌస్‌లోన్ పర్పస్(హెచ్‌ఎల్‌పీ) ద్వారా రూ. 35వేలు మంజూరు చేశారు.
● వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఆర్థిక వెసలుబాటు కల్పించారు. ఒక్కో లబ్ధిదారురాలికి రూ. 20 వేలు అడ్వాన్స్ రూపేణా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
● ఇంటి నిర్మాణం ఎక్కడ ఆగిందో తెలుసుకుని పూర్తి చేసేందుకు డీఆర్‌డీఏ, మెప్మా ద్వారా అదనంగా రూ. 50వేలు, అది చాలకపోతే లక్ష రూపాయల వరకు రుణాన్ని అందించారు.
● జిల్లాలో 56 వేల పక్కాగృహాలు మంజూరు కాగా 35 వేల మంది లబ్ధిదారులు పొదుపు సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. వీరందరికీ అప్పటి ప్రభుత్వం మూడు విడతల్లో ఇచ్చే రూ. 1.80 లక్షలతోపాటు అదనపు రుణం అందజేసింది. తీసుకున్న రుణంలో రూ. 35 వేల వరకు పావలా వడ్డీ వర్తింప జేసింది.
● ఎస్సీ, ఎస్టీ స్వయం సహాయక సంఘాలకు(ఉన్నతి) వడ్డీ లేకుండా అదనపు రుణం అందించారు.
● జగనన్న కాలనీలతోపాటు సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు మూడు విడతల్లో బిల్లు అందజేశారు.
● బేస్‌మెంట్ దశలో సిమెంట్, స్టీల్‌తో కలుపుకుని రూ. 70వేలు, లింటల్‌లెవల్‌లో రూ. 54వేలు, రూఫ్ లెవల్‌లో రూ. 25వేలతోపాటు, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ. 30 వేల చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో బిల్లు మొత్తం జమ చేశారు.
● ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఒక్కో లబ్ధిదారురాలికి ఉచితంగా 20 టన్నుల ఇసుక, రాయితీపై కిటికీలు, చౌకట్లు, బాత్‌రూం డోర్ ఫ్రేమ్‌లు, ఎలక్ట్రికల్ సామాగ్రిని అందజేశారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో
సాయం ఇలా..
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పేదల సొంతింటి కలను దూరం చే
Comments
Please login to add a commentAdd a comment