మనోధైర్యమే ఆయుధంగా..
విధి వక్రీకరించినా ఆమె మనోధైర్యం వీడలేదు. నంద్యాల ఆర్టీసీ డిపోలో కండక్టర్ ఉద్యోగం చేస్తూ భాగ్యలక్ష్మి స్వయం కృషితో పిల్లలను తీర్చిదిద్దారు. ఆమెకు 1991లో వివాహం కాగా.. ఐదు సంవత్సరాలకే భర్త వెంకటేశ్వరప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందాడు. కారుణ్య నియామకం కింద భర్త ఉద్యోగం పొందిన భాగ్యలక్ష్మి.. ఇద్దరు పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వచ్చారు. భాగ్యలక్ష్మి పెద్ద కుమారుడు సాయిశ్రీధర్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాగా, చిన్న కుమారుడు సాయి హర్ష మెడికల్ పీజీలో సీటు సాధించి రేడియాజిస్ట్‌గా పని చేస్తున్నారు. కుమారులను ఉన్నత చదువులు చదివించి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేసిన భాగ్యలక్ష్మి మహిళలకు ఆదర్శంగా నిలిచారు.
– నంద్యాల(వ్యవసాయం)
Comments
Please login to add a commentAdd a comment