నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్‌మీడియెట్ ద్వితీయ సంవత్సరం మ్యాథ్స్, బోట ని, సివిక్స్ పరీక్షకు 347 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 53 పరీక్ష కేంద్రాల్లో 12,534 మంది విద్యార్థులకు గాను 12,187 మంది హాజరయ్యారు. ఒకేషనల్ పరీక్షకు 1,052 మందికి గాను 1,003 మంది హాజరు కాగా 49 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించామని డీఐఈఓ సునీత తెలిపారు. ఎలాంటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్ష కేంద్రాలను తరచుగా ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment