వైకల్యాన్ని అధిగమించి...
చదువుకు, ఉద్యోగానికి వైకల్యం అడ్డురాదని ఆమె నిరూపించారు. రెండు కాళ్లు లేకపోయినా ఆత్మవిశ్వాసంతో బీఎస్సీ, బీఈడీ పూర్తి చేశారు. సచివాలయ మహిళా పోలీస్ ఉద్యోగం సాధించి.. సేవలు అందిస్తున్నారు. సంజామల మండలం వెంకటసుబ్బయ్య, మహేశ్వరి దంపతుల కుమార్తె సువర్ణ విజయ గాథ ఆమె మాటల్లోనే... ‘‘మా తండ్రి విద్యుత్ సబ్‌స్టేషన్‌లో లైన్‌మెన్‌గా పనిచేస్తూ నాతోపాటు తమ్ముడు సురేష్, చెల్లెలు సుమిత్రను ఉన్నత చదువులు చదివించారు. ప్రస్తుతం లైన్‌మెన్‌గా రిటైర్డ్ అయి కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. పుట్టిన ఏడాదికే పోలియో సోకి నా రెండు కాళ్లు చచ్చుబడ్డాయి. అప్పటి నుంచి రెండు కర్రల సాయంతో నడక సాగిస్తున్నాను. కాళ్లు లేకపోయినా మనోధైర్యంతో బీఎస్సీ, బీఈడీ పూర్తి చేశాను. 2019లో గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసుగా ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం సంజామల మండలంలోని ముక్కమల్ల గ్రామ సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాను’’. – కోవెలకుంట్ల
● విభిన్న రంగాల్లో రాణిస్తున్న మహిళలు
● ఇతరుల ఎదుగుదలలోనూ సహకారం
● నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
లాలన..పాలన.. ఓర్పు.. నేర్పు.. పట్టుదల.. క్రమశిక్షణ.. వీరత్వం.. ధీరత్వం.. సహనం.. సౌశీల్యం.. వీటి ప్రతి రూపమే మహిళ.. ప్రాచీన కాలం నుంచి నేటి డిజిటల్ ఆధునిక కాలం వరకు సీ్త్ర లేకపోతే పురుషునికి ఎదుగుదల ఉండదని నిరూపితమైతూనే ఉంది. ప్రస్తుతం సీ్త్ర చైతన్యాన్ని శక్తి సామర్థ్యాలను గమనించిన పురుషులు ఆమె ఎదుగుదలను అంగీకరిస్తూ ప్రోత్సహిస్తున్నాడన్నది అక్షర సత్యం. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో పలు రంగాల్లో రాణిస్తున్న మహిళామణుల విజయ గాథలు ఇవీ..
వైకల్యాన్ని అధిగమించి...
వైకల్యాన్ని అధిగమించి...
Comments
Please login to add a commentAdd a comment