వేలాది మందికి ప్రాణదానం
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్లాస్టిక్ సర్జరీ హెచ్‌ఓడీగా పనిచేస్తున్న డాక్టర్ ఎం. మంజులాబాయి 30 ఏళ్ల తన సర్వీసులో వేలాది మందికి ప్రాణదానం చేశారు. ఎంతో మందికి అందమైన రూపాన్ని ఇచ్చారు. విజయ ప్రస్థానం డాక్టర్ మాటల్లోనే.. ‘‘ మానాన్నతో పాటే పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించా. మెరిట్ స్కాలర్‌షిప్‌లతో ఇంటర్‌లోనూ మంచి మార్కులు సాధించా. 1986–92వరకు తిరుపతిలోని స్విమ్స్‌లో ఎంబీబీఎస్, 1995 నుంచి 98వరకు కర్నూలు మెడికల్ కాలేజిలో జనరల్ సర్జరీ పీజీ పూర్తి చేశా. గోనెగండ్ల పీహెచ్‌సీలో కొన్ని వందల మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించాను. కొంత కాలానికే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల జనరల్ సర్జరీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా అవకాశం రావడంతో చేరాను. ప్లాస్టిక్ సర్జరీ కోర్సు 2003 నుంచి 2006 వరకు ఉస్మానియా మెడికల్ కాలేజీలో పూర్తి చేశాను. వేలాది మందికి శస్త్రచికిత్సలు చేసి ప్రాణం పోశా. పేదలకు వైద్య సేవలు అందించడం చాలా ఆనందంగా ఉంది. – కర్నూలు(హాస్పిటల్)
Comments
Please login to add a commentAdd a comment