ఆరేళ్ల కుమార్తెతో తండ్రి అదృశ్యం
కోవెలకుంట్ల: పట్టణంలోని ఆటో నగర్‌లో నివా సం ఉంటున్న ఓ వ్యక్తి తన ఆరేళ్ల కుమార్తెతో సహా అదృశ్యమయ్యాడు. శుక్రవారం ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. ఉయ్యాలవాడకు చెందిన ఉసేన్‌బాబుకు వైఎస్సార్ జిల్లా మైలవరం మండలం పొన్నంపల్లెకు చెందిన దస్తగిరమ్మతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఆరేళ్ల కుమార్తె ధాత్రి ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి ఉసేన్‌బాబు కోవెలకుంట్లలో స్థిరపడి దుర్గా ఫొటో స్టూడియోలో పనిచేస్తుండగా భార్య వ్యవసాయ పనులకు వెళుతూ కుటుంబాన్ని పో షించుకుంటున్నారు. ఈ నెల 3వ తేదీన ఉదయం దస్తగిరిమ్మ కూలీ పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చే సరికి భర్త, కుమార్తె కన్పించలేదు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్ల వద్ద విచారించినా ఆచూకీ లభ్యం కాలేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళనతో పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment