అయినా.. ప్రయోజనం లేదు
గ్రామాల్లో చెత్త సేకరిస్తున్నారు కానీ ప్రయో జనం లేకుండా పోతోంది. ఆ చెత్తను రోడ్ల వెంటనే విడిచి పెడుతున్నారు. కుక్కలు, పందులు వ్యర్థాలను తీసుకొచ్చి ఇళ్ల ముందు పడేస్తున్నాయి. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
– చాకలి నాగలక్షమ్మ, మహదేవపురం
చెత్త సంపద కేంద్రాలనుపట్టించుకునే వారు లేరు
గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడంతో పారిశుద్ధ్యంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. కొన్ని గ్రామాల్లో రహదారుల వెంట వెళ్లాలంటే కూడా ఇబ్బందిగా ఉంది. చెత్త సంపద కేంద్రాలు పని చేయడం లేదు. అధికారులు ర్యాలీలు, సదస్సులు నిర్వహించడంతో పాటు సంపద కేంద్రాలను పని చేసేలా చర్యలు తీసుకోవాలి.
– గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, ఆళ్లగడ్డ
వినియోగంలోకి తీసుకువస్తాం
గ్రీన్ వెహికిల్స్ ద్వారా గ్రామాల్లో చెత్తను ఎప్పటికప్పుడు సేకరించి డంపింగ్‌కు తరలిస్తున్నాం. మరమ్మతులకు గురైన కేంద్రాలకు త్వరలో వినియోగంలోకి తీసుకు వస్తాం. చెత్తకు నిప్పు పెట్టకుండా అవగాహన కల్పిస్తాం. చెత్త సంపద తయారీ కేంద్రాలతో పంచాయతీలకు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటాం.
– అశ్విన్, ఈవోపీఆర్డీ, ఆళ్లగడ్డ
అయినా.. ప్రయోజనం లేదు
అయినా.. ప్రయోజనం లేదు
Comments
Please login to add a commentAdd a comment