సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పేరిట మోసం
● ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు
కర్నూలు: హైదరాబాద్‌లో బిందు కన్సల్టెన్సీ పేరిట సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అశ్విని, సాయికృష్ణ, హిమబిందు కలసి రూ.60 వేలు తీసుకుని మోసం చేశారని కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రమేష్‌కుమార్ రెడ్డి ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. కర్నూలు టూటౌన్ పక్కనున్న క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 122 ఫిర్యాదులు రాగా.. వీటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన పరిష్కారం చూపుతామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా కూడా పాల్గొని వినతులను స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment