పట్నా: బీహార్‌లోని సుపాల్ జిల్లాలో 100 మందికి పైగా పోలీసు కానిస్టేబుళ్లు హఠాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. కలుషితాహారం తీసుకున్నందునే వీరి ఆరోగ్యం క్షీణించింది. వీరంతా జిల్లాలోని భీమ్ నగర్‌లోని బీఎంపీ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు. దీని వెనుక కుట్ర దాగివుండవచ్చని పోలీసులు అధికారులు అనుమానిస్తున్నారు. బాధిత కానిస్టేబుళ్లను ఆస్పత్రికి తరలించారు. ఇంత పెద్ద సంఖ్యలో కానిస్గేబుళ్లు ఆస్పత్రిలో చేరడంతో స్థానికంగా కలకలం చెలరేగింది.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం బీహార్‌కు చెందిన సీనియర్ కానిస్టేబుళ్లను సుపాల్ జిల్లాలోని బీఎంపీ శిక్షణా కేంద్రంలో ప్రత్యేక శిక్షణ కోసం పంపారు. ఆదివారం సాయంత్రం వీరు భోజనం చేసిన తర్వాత కొందరి ఆరోగ్యం క్షీణించింది. వెంటనే వీరిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వీర్‌పూర్ సబ్ డివిజనల్ అధికారి నీరజ్‌కుమార్ ఆస్పత్రికి చేరుకుని సైనికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ ఉదంతంపై బీహార్ పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మృత్యుంజయ్ సింగ్ మాట్లాడుతూ అస్వస్థతకు గురైన పోలీసులందరికీ మెరుగైన చికిత్స అందించేందుకు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ ఘటనపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment