బంకిమ్ చంద్ర చటర్జీ మిడ్నాపూర్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ పాఠశాలలో ఉన్నప్పుడే ఆయన తన తొలి కవిత రాశారు. అక్కడ ఎఫ్.టీడ్ అనే ఉపాధ్యాయుడు బంకిమ్‌బాబును బాగా అభిమానించేవాడు. కారణం, చిన్నతనంలోనే బంకిమ్‌బాబు చదువులో చూపిన చురుకుదనం. టీడ్‌కు, జిల్లా మేజిస్ట్రేట్ మాలెట్‌కు మంచి పరిచయం ఉండేది. ఓసారి పిల్లలతో పాటు, బంకిమ్‌బాబును కూడా మాలెట్ ఇంటికి తీసుకెళ్లాడు టీడ్. కొంతసేపు గడిచిన తర్వాత ఆంగ్లేయుడైన టీడ్, తన పిల్లలను మాత్రం మాలెట్ తేనీటి కోసం లోపలికి పిలిచాడు. బంకిమ్‌బాబును పట్టించుకోలేదు.
అది సహజంగానే బంకిమ్‌బాబును బాధించింది. అదే సమయంలో ఇంగ్లిష్‌వాళ్ల మనస్తత్వం ఏమిటో ఆ వయసులోనే అర్థం చేసుకునే అవకాశాన్ని కూడా ఆ సంఘటన కల్పించింది. బంకిమ్‌బాబు చదువు ప్రశాంతంగా సాగలేదు. అప్పుడే ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ఎగసింది. అలాగే ఆ రోజుల్లో అంతగా ఇంగ్లిష్ చదువుకున్నా కూడా ఆయన జీవితం నల్లేరు మీద బండిలా సాగలేదు. కంపెనీ పాలనలో గానీ, ఆ తరువాత రాణి పాలనలో గానీ ఎంత పెద్ద చదువు చదివినా అది ఇంగ్లిష్ చదువే అయినా, ఇంగ్లిష్ వారు భారతీయుల పట్ల వ్యవహరించే తీరు ఆయకు నచ్చేది కాదు.
ఉద్యోగిగా సంకెళ్ల మధ్య ఉన్నప్పటికీ ఆయన తన ప్రవృత్తిని మాత్రం స్వేచ్ఛగా ఉండనిచ్చారనిపిస్తుంది. ఉద్యోగం, సామాజిక పరిస్థితుల నుంచి సృజనాత్మ కతను రక్షించుకున్నారనిపిస్తుంది. ఫలితమే ‘అనందమఠ్ వంటి మహోన్నత రచన. అందులోనిదే వందేమాతర గీతం. నేడు (జూన్ 26) బంకిమ్ చంద్ర చటర్జీ జయంతి. ఆయన 1838 లో వంగభూమిలోని కాంతల్ పడా (ఇరవైనాలుగు పరగణాల జిల్లా) లో జన్మించారు. తండ్రి యాదవ్‌చంద్ర, తల్లి దుర్గాదేవి.
(చదవండి: స్వతంత్ర భారతి... భారత్–పాక్ యుద్ధం)
Comments
Please login to add a commentAdd a comment