గాల్వాన్‌ లోయలో అమరులైన మన దేశ ముద్దుబిడ్డలు.. | A Big Salute To Our Martyrs In Galwan | Sakshi
Sakshi News home page

గాల్వాన్‌ లోయలో అమరులైన మన దేశ ముద్దుబిడ్డలు..

Published Wed, Jun 16 2021 12:56 PM | Last Updated on Wed, Jun 16 2021 1:42 PM

A Big Salute To Our Martyrs In Galwan - Sakshi

న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో ఉన్న గల్వాన్‌ లోయలో భారత్‌,  చైనా ఆర్మీల మధ్య ఘర్షణ తలెత్తి ఏడాది గడిచింది.  చైనా దొంగ దెబ్బ తీయడంతో.. ఈ ఘర్షణలో భారత్‌ కు చెందిన 20 మంది ముద్దుబిడ్డలు అమరులయ్యారు. అయితే, ఈ సంఘటనలో మన జవాన్లు అత్యంత ధైర్యసాహాసాలు ప్రదర్శించారు.  వారి కాల్పులకు మనవారు సైతం .. గట్టిగా సమాధానం ఇచ్చారు.

దీంతో ఈ కాల్పులలో   చైనాకు చెందిన 35 సైనికులు మరణించారు. గాల్వాన్‌ లోయలో అమరులైన మన దేశ ముద్దుబిడ్డలు.. వారి హోదా ఈ క్రింద ఇవ్వబడినాయి. ఆ భగవంతుడు వీర జవాన్ల ఆత్మకు శాంతిని, వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇ‍వ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. 

1. బి. సంతోష్‌ బాబు(కల్నల్‌) - సూర్యాపేట, తెలంగాణ
2. నాధూరం సోరెన్‌ ( నాయబ్‌ సుబేదార్‌) - మయూర్‌ బంజ్‌, ఒడిశా
3. మన్‌దీప్‌ సింగ్‌ ( నాయబ్‌ సుబేదార్‌) - పాటియాల, పంజాబ్‌
4. సత్నమ్‌ సింగ్‌ ( నాయబ్‌ సుబేదార్‌) - గురుదాస్‌పూర్‌, పంజాబ్‌
5. కె. పళని (హవిల్దార్‌) - మధురై, తమిళనాడు
6. సునిల్‌ కుమార్‌ (హవిల్దార్‌) - పట్నా, బిహర్‌
7. బిపుల్‌ రాయ్‌ ( హివిల్దార్‌) - మీరట్‌, ఉత్తర ప్రదేశ్‌
8. దీపక్‌ కుమార్‌ (సిపాయి) - రీవా, మధ్యప్రదేశ్‌
9. రాజేష్‌ అరంగ్‌ (సిపాయి) - బిర్భుమ్‌, పశ్చిమ బెంగాల్‌
10. కుందన్‌ కుమార్‌ ఓజా (సిపాయి) - సాహిబ్‌ గంజ్‌, జార్ఖండ్‌
11. గణేష్‌రామ్‌ (సిపాయి) - కాంకెర్‌, ఛత్తీస్‌ఘడ్‌
12. చంద్రకాంత్‌ ప్రధాన్‌ (సిపాయి) - కందమాల్‌, ఒడిషా
13. గుర్విందర్‌ సింగ్‌ (సిపాయి) - సంగ్రూర్‌, పంజాబ్‌
14. గుర్‌ తేజ్‌ సింగ్‌ (సిపాయి) - మాన్నా, పంజాబ్‌
15. అంకుశ్‌ (సిపాయి) - హమిర్‌పూర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌
16. చందన్‌ కుమార్‌ ( సిపాయి) - భోజ్‌పూర్‌, బిహర్‌
17. కుందన్‌ కుమార్‌ (సిపాయి) - సహస్ర, బిహర్‌
18. అమన్‌ కుమార్‌ (సిపాయి) - సమస్తిపూర్‌, బిహర్‌
19. జై కిశోర్‌ సింగ్‌ (సిపాయి) - వైశాలి, బిహర్‌
20. గణేష్‌ హన్స్‌డ్‌ (సిపాయి) - తూర్పు సింగ్భమ్‌, జార్ఖండ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement