అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనంత ప్రభంజనంతో బీజేపీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్(92)ను దాటేసి ఏకంగా 150కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది కాషాయం పార్టీ. ఈ ఫలితంలో గుజరాత్ తమ కంచు కోట అని బీజేపీ చాటిచెప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
నరేంద్ర మోదీ చరిష్మా గుజరాత్ ఎన్నికలకు బాగా కలిసొచ్చింది. మోదీతో పాటు అమిత్ షా సొంత రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకునే ప్రయత్నాలు భారీగా సక్సెస్ అయ్యాయి. గుజరాత్‌లో అన్ని అసెంబ్లీ ఎన్నికల రికార్డులను బీజేపీ బద్ధలు కొట్టింది. వరుసగా ఏడోసారి అధికారం జేక్కిచ్చుకుని.. పశ్చిమ బెంగాల్ వామపక్ష పార్టీ అధికార కైవసం రికార్డు సరసన నిలవబోతోంది. అలాగే గుజరాత్ గడ్డ నుంచే మరో రికార్డును సైతం నెలకొల్పే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
గుజరాత్ చరిత్రలో ఇంత మెజార్టీతో ప్రభుత్వాన్ని మునుపెన్నడూ ఏర్పాటు చేసింది లేదు. 1985లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 149 సీట్లు గెల్చుకుంది. ఆ టైంలో మాధవ్ సింగ్ సోలంకి నేతృత్వం వహించారు.
ఆపై 2002లో 127 సీట్లు సాధించింది ఆ లిస్ట్‌లో వెనుక నిల్చుకుంది బీజేపీ. ఇక ఇప్పుడు ఏకంగా 150 సీట్లకు పైగా ఆధిక్యంలో దూసుకుపోతున్న కమలం.. కాంగ్రెస్ నెలకొల్పిన ప్రభుత్వ ఏర్పాటు రికార్డును బద్ధలు కొడుతుందా? అనే తుది ఫలితం వచ్చాకే తేలేది.
Comments
Please login to add a commentAdd a comment