అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి | Bullets Fired in Oakland California | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి

Aug 18 2024 12:36 PM | Updated on Aug 18 2024 12:45 PM

Bullets Fired in Oakland California

అమెరికాలోని ఓక్లాండ్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. కాల్పుల మోతతో ఆ ప్రాంతంలోని వారంతా భయాందోళనలకు లోనయ్యారు.

మీడియాకు శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఈస్ట్ ఓక్లాండ్‌లోని నివాస ప్రాంతంలోని 83వ అవెన్యూలోని 1600 బ్లాక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకునే సమయానికే దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారైన దుండగుని కోసం గాలింపు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement