సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇటు తెలంగాణ రాజకీయాల్లోనూ లిక్కర్ స్కాం కేసు ప్రకంపనలు సృష్టించింది. అయితే, ఈ కేసులో తాజాగా కొత్త కోణం బయటకు వచ్చింది. లిక్కర్ కేసు దర్యాప్తులో అధికారులు లంచం తీసుకున్నట్టు ఆరోపణలు బయటకు వచ్చాయి.
వివరాల ప్రకారం.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. కేసు దర్యాప్తులో అధికారులు లంచం తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఖత్రీపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఖత్రీతో పాటుగా అప్పర్ డివిజన్ క్లర్క్ నితేష్ కోహర్, క్లారిడ్జెస్ హోటల్స్ సీఈవో విక్రమాదిత్య, ఎయిర్ ఇండియా ఉద్యోగి దీపక్ సాంగ్వాన్, అమన్‌దీప్ సింగ్ ధాల్, బీరేందర్ పాల్ సింగ్, ప్రవీణ్ కుమార్ వాట్స్‌పై కూడా సీబీఐ కేసు ఫైల్ చేసింది. అయితే, సదరు అధికారి లంచం తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. రూ.5కోట్లు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి.
CBI has registered a case against Pawan Khatri, Assistant Director ED, Deepak Sangwan employee of Air India, Vikramaditya CEO of Claridges Hotels & Resorts and others accused in connection with the ongoing delhi liquor scam case.
— ANI (@ANI) August 28, 2023
ఇది కూడా చదవండి: భారత్‌కు రాలేనన్న పుతిన్.. అరెస్ట్ భయమే కారణమా?
Comments
Please login to add a commentAdd a comment