ఢిల్లీలో కొత్తగా 3,229 పాజిటివ్‌ కేసులు | Coronavirus Update: 3 Thousand New Positive Cases Filed In Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో కొత్తగా 3,229 పాజిటివ్‌ కేసులు

Published Mon, Sep 14 2020 8:11 PM | Last Updated on Mon, Sep 14 2020 8:49 PM

Coronavirus Update: 3 Thousand New Positive Cases Filed In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో 2,21,533 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు తాజాగా వెలువడిన హెల్త్‌ బులెటిన్‌లో ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడచిన 24 గంటలలో న్యూఢిల్లీలో 3,229 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 3,374. మృత్యువాత పడిన వారి సంఖ్య 26గా ఉంది.  దీంతో​ ఢిల్లీ మొత్తం కేసుల సంఖ్య 2,21,533కు చేరుకోగా.. మృతుల సంఖ్య 4,770 చేరుకుంది. కోవిడ్‌ కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో 1,88,122 మంది డిశ్చార్జ్ అయ్యారు.  దీంతో ప్రస్తుతం ఢిల్లీలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 28,641 ఉండగా.. ఇవాళ(సోమవారం) 9,859 మందికి కరోనా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. అదే విధంగా ఇవాళ ఒక్కరోజే 35,025 మందికి ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించడంతో కరోనా పరీక్షల సంఖ్య 21,84,316లకు చేరుకుంది. రాజధానిలో హోం ఐసోలేషన్‌లో 16,568 మంది ఉండగా.. కంటైన్మెంట్ జోన్‌లలో 1517 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు.(చదవండి: గత 24 గంటల్లో 92,071 కేసులు)

ప్రస్తుతం ఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో దాదాపు 4,4091 బెడ్లు అందుబాటులో ఉండగా.. ప్రతి మిలియన్ జనాభాలో 1,14,964 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు న్యూఢిల్లీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 92,071 కొత్త కేసులు వెలుగు చూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 48,46,427 చేరుకుంది. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,136 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 79,722కు చేరింది. గత మూడు రోజుల నుంచి భారత్‌లో ప్రతి రోజు వెయ్యి మరణాలు నమోదవుతున్నాయి. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 9,86,598 పాజిటివ్‌ కేసుల ఉండగా.. 37,80,107 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement