![Delhi High Court Hearing Arvind Kejriwal Plea Against Enforcement - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/26/Arvind%20Kejriwal_0.jpg.webp?itok=MHFvCTQj)
సాక్షి, ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. కేజ్రీవాల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ స్వర్ణ కాంత శర్మ బుధవారం ఉదయం 10.30గంటలకు విచారణ చేపట్టనున్నారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారంటూ అభియోగాలు మోపింది. రెండేళ్ల క్రితం ఎక్సైజ్ పాలసీ అమలులో భాగంగా లిక్కర్ కాంట్రాక్టర్ల నుంచి కేజ్రీవాల్ సుమారు రూ.100 కోట్లు ముడుపులు తీసుకున్నారని ఆరోపిస్తోంది.
ప్రస్తుతం ఈ కేసు విచారణ నిమిత్తం కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకున్న ఈడీ మార్చి 28 వరకు తన కస్టడీలోనే ఉంచుకోనుంది. ఈ తరుణంలో ఈడీకి వ్యతిరేకంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ కేసులో అరెస్ట్‌ను వ్యతిరేకించడంతోపాటు, ఈడీ కస్టడీకి పంపుతూ ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేశారు. ఆ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారించి తీర్పు ఇవ్వనుంది.
Comments
Please login to add a commentAdd a comment