
భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ వ్యక్తి తన నెల శిశువుకు పురుగుల మందు ఇచ్చాడు. ఈ అమానవీయ ఘటన ఒరిస్సాలోని బాలాసోర్‌లో జరిగింది.
చందన్, తన్మయికి గత ఏడాది వివాహం జరిగింది. ఈ నెల 9న వారికి ఓ శిశువు పుట్టింది. ఆస్పత్రి నుంచి తన్మయి డిఛార్జ్ కాగానే నీలగిరి పోలీసు స్టేషన్ పరిధిలోని సింగిరి గ్రామంలోని తల్లిగారింటికి వెళ్లింది. ఈ క్రమంలో పాపను చూడడానికి అత్తగారింటికి చందన్ వెళ్లాడు. భార్య వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు, తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును పసిపాపకు ఎక్కించాడు. పాప ఏడుపుతో బయటికి వచ్చిన తన్మయి షాక్‌కు గురైంది. భర్తను దూరంగా నెట్టి పాపను తీసుకుంది. తన తల్లిదండ్రులకు విషయం తెలుపగా.. వారు పాపను ఆస్పత్రికి తరలించారు.
ఘటనపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయనప్పుటికీ గ్రామస్తుల సమాచారంతో కేసును సుమోటోగా తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పాప పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
చదవండి:రోడ్డుపై లవర్స్ రొమాంటిక్ వీడియో..కేసుపై పోలీసుల తంట..!