న్యూఢిల్లీ: 2011 నుంచి ఇప్పటి వరకు మొత్తం 16 లక్షల మందికి పైగా భారతీయులు భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వీరిలో ఒక్క 2022 సంవత్సరంలోనే అత్యధికంగా 2.25 లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదిలిపెట్టారని వివరించింది.
విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. అమెరికా కంపెనీలు ఇటీవలి కాలంలో ఉద్యోగ నిపుణులను తొలగిస్తున్న విషయాన్ని తాము పరిశీలిస్తున్నట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ చెప్పారు. వీరిలో హెచ్–1బీ, ఎల్1 వీసాలు కలిగిన భారతీయులు కూడా ఉన్నారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment