మహబూబా ముఫ్తీకి త్రుటిలో తప్పిన ప్రమాదం | Narrow Escape For PDF Chief Mehbooba Mufti, After Her Car Meets With Accident In Jammu And Kashmir - Sakshi
Sakshi News home page

Mehbooba Mufti Car Accident: జమ్ము మాజీ సీఎంకి త్రుటిలో తప్పిన ప్రమాదం

Jan 11 2024 4:41 PM | Updated on Jan 11 2024 5:14 PM

Jammu Car Accident: Narrow Escape For Mehbooba Mufti - Sakshi

జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సయ్యద్‌కి.. 

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సయ్యద్‌కి తృటిలో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఆమె ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. అయితే ఆమె క్షేమంగా ఉన్నట్లు కూతురు ఇల్తిజా మీడియాకు తెలియజేశారు.

గురువారం మధ్యాహ్నాం అనంత్‌నాగ్‌ జిల్లా సంఘం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ముఫ్తీ ప్రయాణిస్తున్న బ్లాక్‌ కలర్‌ స్కార్పియో వాహనం.. మరో కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆమెకు ఏం కాలేదని తెలుస్తోంది. అయితే ఆమెకు భద్రతగా వచ్చిన పోలీస్‌ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. 

ఖానాబాల్‌ అగ్నిప్రమాదం బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలోనే ఈ ఘటన జరిగింది. ప్రమాదం తర్వాత ఆమె పరామర్శకు వెళ్లడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement