ముంబై: భారత్‌లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఓ వైపు డెల్టా వేరియంట్ నుంచి ప్రపంచదేశాలు బయటపడకముందే ఒమిక్రాన్ రూపంలో దాడి జరుగుతుండటం కలకలం రేపుతోంది. దేశంలో ఇప్పటికే 26 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా తాజాగా మరో 6 కేసులు నమోదయ్యాయి. ఈ ఆరు కేసులు మహారాష్ట్రలోనే వెలుగు చూడటం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 32కు చేరింది.
కాగా గురువారం నాటికి దేశ వ్యాప్తంగా 23 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు ఉండగా.. శుక్రవారం రోజు కొత్తగా 9 పాజిటివ్‌లు నమోదయ్యాయి. మధ్యాహ్నం నాటికి మూడు(గుజరాత్ 2, మహారాష్ట్ర1) కేసులు నమోదవ్వగా అదే రోజు మరో ఆరు కేసులు (మహరాష్ట్ర 6) నమోదయ్యాయి. మొత్తంగా ఒకేరోజు గుజరాత్‌లో ఇద్దరు, మహారాష్ట్రలో ఏడుగురు ఒమిక్రాన్ బారిన పడ్డారు.
చదవండి: కేరళలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం..బాతులు, కోళ్లను చంపేయండి!
ఒమిక్రాన్ అలజడి: భారత్‌లో మరో మూడు కేసులు..
Comments
Please login to add a commentAdd a comment