ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని జీఎస్‌బీ సేవా మండల్ అత్యంత సంపన్న గణేశ్ మండల్‌గా పేరుగాంచింది. నగరంలో గత 68 ఏళ్లుగా మండపాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈసారి తమ మండపానికి రూ.316.4 కోట్ల బీమా చేయించినట్లు జీఎస్‌బీ సేవా మండల్ చైర్మన్ విజయ్ కామత్ చెప్పారు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే వినాయక నవరాత్రి వేడుకల్లో మండపాన్ని దర్శించే ప్రతి భక్తుడూ బీమా పరిధిలోకి వస్తాడని తెలిపారు.
మొత్తం బీమాలో రూ.31.97 కోట్లు బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు, సామగ్రికి వర్తిస్తుందన్నారు. రూ.263 కోట్ల బీమా మండపానికి, వాలంటీర్లకు, పూజారులకు, వంటవాళ్లకు, పాదరక్షల స్టాల్ కార్మికులకు, పార్కింగ్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులకు వర్తిస్తుందని వివరించారు.
అగ్నిప్రమాదం, భూకంపం సంభవిస్తే పరిహారం పొందడానికి గాను ఫర్నిచర్, కంప్యూటర్లు, సీసీటీవీ కెమెరాలు, స్కానర్లకు రూ.కోటితో ఇన్సూరెన్స్ చేయించామన్నారు. విఘ్న వినాయకుడి ఆశీస్సులు పొందడానికి వచ్చే ప్రతి భక్తుడికి భద్రత కల్పించాలన్నదే తమ ఉద్దేశమని విజయ్ కామత్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment